AP: పరకామణి కేసులో ఫిర్యాదుదారు SI సతీశ్ కుమార్‌ది హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఫోరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో వైద్యులు మృతదేహానికి సిటీ స్కాన్ చేశారు. సతీశ్ తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు వైద్యులు గుర్తించారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుపుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.