AP: పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో సాదిక్ చుట్టూ పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. సౌజన్య భర్త జగదీశ్రెడ్డి హత్యకేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు, ఖాదీర్, రెహమాన్ల నుంచి సమాచారం రాబట్టారు. పెర్ఫ్యూమ్లో వాడే కెమికల్ను సాదిక్ తీసుకెళ్లాడని వారు వెల్లడించారు. సాదిక్ను కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే సర్పవరం పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా, ఎల్లుండి కోర్టు తీర్పు వెలువరించనుంది.