AP: మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా దారి మళ్లింది. భారీ వర్షాల కారణంగా భోగాపురం విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడటంతో విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించారు. దాదాపు రెండు గంటల ఉత్కంఠ అనంతరం విమానం నాగ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని మంత్రులతో పాటు ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు.