వల్లభనేని వంశీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఆయనపై మైనింగ్‌ కేసు కూడా నమోదై ఉంది. ఈ కేసులో విచారణ నిమిత్తం వంశీ గన్నవరం పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. విచారణకు అవసరమైన సంతకాలు చేశారు. అయితే విచారణాధికారి అక్కడ లేకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేస్తూ వల్లభనేని వంశీ అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్