AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపునకు ఉపయోగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. కేవీఆర్ అరెస్టులో చట్టపరమైన విధానాలు పాటించలేదని, తెలంగాణ పోలీసులు కూడా ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. కేవీఆర్, ప్రశ్న రావణ్‌లకు వైసీపీతో సంబంధం లేదని, రావణ్‌పై యూఏపీఏ వంటి కఠిన చట్టాలు ప్రయోగించడం దారుణమని అన్నారు. రావణ్‌కు వైసీపీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.