AP: ట్రూఅప్ పేరుతో గత ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిందని మంత్రి గొట్టిపాటి రవి విమర్శించారు. ఆ భారాన్ని కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ చేస్తోందని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్ల విద్యుత్ భారాన్ని మోపింది. కానీ కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తోంది. శ్రీశైలంలో మెరుగైన సౌకర్యాల కోసం 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు అయింది.’ అని అన్నారు.