గత ప్రభుత్వంలో తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు: మంత్రి నాదెండ్ల

గత ప్రభుత్వంలో తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడలో నాదెండ్ల మీడియాతో మాట్లుడుతూ.."వైసీపీ హయాంలో తెనాలి ఐతానగ‌ర్‌లో ఇళ్లలో గంజాయి మొక్కలు పెంచారు. రెండు గ్యాంగ్‌‌లను సృష్టించి గంజాయి అమ్ముకునే హక్కు కల్పించారు. ఆ మత్తులో వారు అనేక అరాచకాలకు పాల్పడ్డారు. గంజాయి ముఠాల వల్ల బాధితులకి జగన్ ఏం సమాధానం చెబుతారు? రాజకీయ లబ్ధి, సమాజంలో చీలికల కోసమే జగన్ తెనాలి పర్యటనకు వస్తున్నారు." అని అన్నారు.

సంబంధిత పోస్ట్