నాటుకోడి మాంసం ధర మటన్‌ కంటే ఎక్కువ: అవినాష్‌రెడ్డి

AP: రాష్ట్రంలో నాటుకోడి రిటైల్ ధరలు మటన్ కంటే ఎక్కువగా పెరిగిపోయాయని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. దీనికి కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్‌రంజన్‌సింగ్‌ బదులిస్తూ, ఏపీలో నాటుకోడి మాంసం ధర కిలో రూ.500 ఉండగా, మటన్ ధర దాదాపు రూ.900 ఉందని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పశుసంవర్ధకశాఖ నుంచి సమాచారం అందిందని తెలిపారు. అందువల్ల ఎంపీ లేవనెత్తిన మిగతా ప్రశ్నలేవీ ఉత్పన్నం కావని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్