AP: గ్రామ సచివాలయ ఉద్యోగులపై ఉక్కుపాదం అన్యాయమని, వారు రాజ్యాంగబద్ధంగా గళాన్ని విప్పితే అణచివేస్తారా? అంటూ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. రక్షక భటులు.. రాక్షస భటులుగా మారిపోయారని అన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వందలాది మంది ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం చేసిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించిందని మండిపడ్డారు.