పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం: కాకాణి

AP: రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారిందని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పొగాకు రైతులతో కలిసి కందుకూరు పొగాకు బోర్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పొగాకు ధర క్వింటాకు రూ.16 వేలకు పడిపోయింది. ఇంత దారుణంగా ఎప్పుడూ పడిపోలేదు. పొగాకు కొనుగోలులో కూడా అవకతవకలు జరిగాయి. తమకు అనుకూలమైన వారి బేళ్లు ఎక్కువ ధరకు కొనుగోళ్లు చేయడం దారుణం’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్