కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులైన జోగి రాజీవ్, జోగి రోహిత్, అలాగే వారి సోదరులైన జోగి రాము కుమారులైన జోగి రాకేశ్, జోగి రామ్మోహన్‌లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం సిట్ విచారణకు జోగి సోదరుల కుమారులు హాజరుకానున్నారు.