ఏపీలో MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరో కీలక ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను సెప్టెంబర్ 19న అధికారికంగా ప్రచురించింది. సెప్టెంబర్ 15న ముసాయిదా జాబితా విడుదల చేయగా.. 15, 16 తేదీల్లో అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం మండల, జిల్లా స్థాయిలో పరిశీలించి మార్పులు, చేర్పులు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తవడంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.