AP: వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇతర మతాల వారిపై దాడులు సరికాదని, అన్ని మతాలనూ గౌరవించుకోవాలని ఆయన అన్నారు. కుప్పం నియోజకవర్గంపై కక్షగట్టి, హంద్రీనీవా నీళ్లు ఇచ్చినట్లు డ్రామాలు ఆడి, సెట్టింగ్‌లు వేసి నాటకాలు ఆడారని చంద్రబాబు విమర్శించారు.