AP: కోనసీమ జిల్లా, గూడవల్లి గ్రామానికి చెందిన పున్నం రామ నరసింహ, పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుమానిత వ్యక్తిగా ప్రచారం జరిగిన నేపథ్యంలో, తాను జనసేన కార్యకర్తనేనని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితమే జనసేన సభ్యత్వం తీసుకున్నానని, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ ఇచ్చిన ఎంట్రీ పాస్ తోనే పవన్ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. తనను పార్టీలో గిట్టని వారు పాత ఫోటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నరసింహ 13 సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసినట్లు కూడా తెలిపారు.