AP: 'మొంథా' తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. యలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలో ఉన్న శారద నదికి గండి పడింది. దీంతో వైలోవ గ్రామం పూర్తిగా నీటమునిగింది. గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా ఓ కుటుంబం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వీరిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోటు సహాయంతో బయటికి తీసుకువచ్చారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు చేపట్టి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.