ఆగి ఉన్న రైలులో చోరీ.. దొంగ అరెస్ట్ (వీడియో)

AP: బాపట్ల జిల్లా చీరాలలో ఆగి ఉన్న రైలులో సందీప్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. ఈ నెల 25న నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులోకి సందీప్ చొరబడి హనుమకొండకు చెందిన సాయిప్రియ అనే మహిళ బ్యాగు దొంగిలించి పరారయ్యాడు. మహిళ ఫిర్యాదుతో చీరాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించి 24 గంటల్లో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారం, సెల్‌ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్