TG: 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ బలం పెరిగిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్కైరూట్ కంపెనీని తాము తెస్తే, సీఎం రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మోసపు హామీలు నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, ఆ పార్టీలో కమల్‌హాసన్‌ను మించిన నటులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.