ఏపీని నక్సల్ ఫ్రీ రాష్ట్రంగా మార్చామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. పోలీస్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సహకారంతో ఈ విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో ఎక్కడా మావోయిస్టు కమిటీలు లేవని ఆయన స్పష్టం చేశారు. 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావో కీలక నేత చెల్లూరి నారాయణ రావుతో పాటు మరో 8 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి భారీగా ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. కాగా, నారాయణ రావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు.