స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: SEC

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(SEC) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఎన్నికలు ఆలస్యమైనా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్