AP: మొట్టమొదటిసారిగా విశాఖలో తాగడానికి నీళ్లు లేని దుస్థితి ఏర్పడిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. బుధవారం తాడేపల్లి జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు వచ్చిన తర్వాత విశాఖలో తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. విశాఖలో తాగడానికి మూడు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమాలు చేద్దాం. గట్టిగా ప్రజలకు తోడుగా ఉందాం. స్థానిక సంస్థలు కార్యకర్తల కోసం జరిగే ఎన్నిక. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాం’ అని అన్నారు.