AP: అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హోం మంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుడు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది రిజిస్టర్‌లో సంతకం చేయకపోవడం, యూనిఫామ్ ధరించకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఫోన్ చేసి, డాక్టర్, సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని ఆదేశించారు.