టీడీపీలో ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేవు: గూడపాటి

AP: 12 ఏళ్లుగా టీడీపీలో పనిచేసిన తర్వాత, అక్కడ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేకపోవడంతో బయటకు వచ్చానని గూడపాటి శ్రీనివాసరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, త్వరలోనే చాలామంది పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన అన్నారు. జగన్ అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని, టీడీపీలో కాపులకు ప్రాధాన్యం లేదని, కాపు నేతలంతా వైసీపీలోనే ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నా కాపులకు న్యాయం జరగలేదని, కూటమిలోని కాపులంతా జగన్ వైపే చూస్తున్నారని తెలిపారు.   నిర్మాణాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్