ఏపీలో స్థానిక ఎన్నికలను వేసవి సెలవుల్లోపు నిర్వహించబోమని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. BC జనగణన పూర్తి కాకుండా ఎన్నికలు చేపట్టొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని విచారణ సందర్భంగా ఈ విషయాన్ని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ శ్రీనివాస్ తెలిపారు. BCల స్థితిగతులపై సర్వేకు నెల సమయం పడుతుందని, ఆ తర్వాత BC రిజర్వేషన్లను కమిషన్ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో విచారణను జులైకి హైకోర్టు వాయిదా వేసింది.