AP: వైసీపీకి త్వరలో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో వైపు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ లిస్ట్ లో ఉన్నట్లు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే వల్లభనేని వంశీ, కాకాణి, చెవిరెడ్డి పలు కీలక కేసుల్లో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.