అధికారం పోగానే కండువా మార్చేస్తున్నారు: పేర్ని కిట్టు

AP: అధికారం పోగానే కొందరు పార్టీలు మార్చినా, కార్యకర్తలే తమకు అండగా ఉన్నారని మచిలీపట్నం వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ పేర్ని కిట్టు అన్నారు. టీడీపీ జెండా ఉన్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పథకాలు అందించామని, కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కొల్లు రవీంద్రకు ఛాలెంజ్ విసురుతూ, సీట్లు అమ్ముకునే వారికి, కార్యకర్తలను కుటుంబసభ్యులుగా భావించే వారికి తేడా ఉందని, పోర్టు పేరుతో 33 వేల ఎకరాలు తీసుకున్నది మీరేనని, కేవలం 1700 ఎకరాల్లో వైఎస్‌ జగన్ పోర్టు కట్టారని పేర్ని కిట్టు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕