AP: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన చావు కోసం కొందరు రహస్యంగా పూజలు చేస్తున్నారని, వారి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. తనను కొన్నాళ్లు బతకనివ్వాలని, అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను పిలవకుండానే శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారని, ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.