AP: 'తస్మాత్ జాగ్రత్త.. చంద్రబాబును గతంలో తిరుమల శ్రీవారు అలిపిరి వద్ద వదిలేశారు. ఈ సారి వదలరు.' అని సాక్షి డిబేట్‌లో వైసీపీ నేత నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ విరుచుకుపడింది. 'నాడు ఇంటర్నేషనల్ స్మగ్లర్ గంగిరెడ్డితో చంపాలని చూసారు. నేడు మరోసారి చంద్రబాబు గారిని చంపేస్తామని ఈ సైకో గాళ్ళు ఓపెన్‌గా చెప్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.' అని ఎక్స్‌లో ఓ వీడియోను టీడీపీ షేర్ చేసింది.