AP: సాయి కృష్ణ కేసులో తనను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని సీఐ నాగరాజు కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. కస్టడీ పిటిషన్ విచారణ సందర్భంగా సమర్పించిన లేఖలో తాను ఈ కేసులో నిర్దోషినని పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తూ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన కస్టడీ సిట్ దర్యాప్తునకు అవసరం లేదని, కేవలం కేసులో ఇరికించేందుకే కస్టడీ కోరారని ఆయన వాదించారు. విచారణ అవసరమైతే తన న్యాయవాది సమక్షంలో నిర్వహించాలని, సిట్ అధికారులు తనను వేధింపులకు గురిచేయకుండా కోర్టు రక్షణ కల్పించాలని నాగరాజు కోరారు.