AP: తమపై దాడులు చేయించి తిరిగి తమపైనే కేసులు పెట్టడమేంటని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయాలను పరిశీలించేందుకు వెళ్లిన తమపై దాడులు చేశారన్నారు. రైతులను రెచ్చగొడుతున్నామని చంద్రబాబు అంటున్నారని, దాడి చేసిన వ్యక్తి లోకేశ్ పక్కన కూర్చొని కనిపిస్తున్నాడని చెప్పారు. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసి గాయపరిస్తే ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు.