AP: కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 'గతంలో ఇందిరాగాంధీ చెప్పి ఎమర్జెన్సీ ప్రకటిస్తే, ఇప్పుడు ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తోంది. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలను వేధిస్తున్నారు. చెత్త పాలనతో రికార్డ్ సృష్టించారని' సజ్జల విమర్శించారు.