AP: మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయితే సానుభూతి వస్తుందని జగన్ అనుకుంటున్నారని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ‘చట్టం ఎవరికీ చుట్టం కాదు. తాను లిక్కర్ కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతాడేమో అని భయపడి జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మహిళలను దూషించిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లడం ఏంటి? చంద్రబాబును అకారణంగా 52 రోజులపాటు జైల్లో పెట్టారు. లిక్కర్ స్కాం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు.