AP: YS వివేకా హత్యపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందిచారు. ఆయనను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించి సానుభూతితో ఎన్నికల్లో గెలిచారని ఆయన విమర్శించారు. 'వివేకా తలపై గొడ్డలితో దాడి చేస్తే మెదడు బయటికి వచ్చింది. గుట్టుగా అంత్యక్రియలు చేద్దామని చూశారు. కానీ ఆయన కూతురు సునీత.. పోస్టుమార్టం చేయాలని కోరింది. అందులో ఆయనది గుండెపోటు కాదని గొడ్డలివేటుగా తేలింది. తర్వాత డ్రామా మార్చి నారాసుర రక్తచరిత్ర అంటూ కత్తి నా చేతిలో పెట్టారు' అని వ్యాఖ్యానించారు.