AP: అంబటిని హత్య చేసేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని.. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడులు అత్యంత హేయం.. వీళ్లందరూ చేసిన తప్పేంటి?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.