AP: పేర్ని నాని, కొడాలి నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. ‘నాడు చేయాల్సిన దోపిడీ చేసి.. ఇవాళ వీరంతా పతివ్రతలుగా మాట్లాడుతున్నారు. బియ్యం దొంగ ఒక పక్క, భూకబ్జాలతో గడ్డం గ్యాంగ్ మరో పక్క, పార్టీ ఆఫీసులపై దాడి చేసిన మట్టి దొంగ ఇంకో పక్క.. వీళ్ల మాటల్ని జనం అసహ్యించుకుంటున్నారు. పేర్ని నాని లాంటి పొలిటీషియన్ జిల్లాలోనే లేరు. పదవుల కోసం నాని ఎంత నీచానికైనా దిగజారుతారు’ అని కొల్లు రవీంద్ర అన్నారు.