సింగిల్‌ డిజిట్‌ మెజార్టీతో గెలిచారు వీరే

AP: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో పలువురు అభ్యర్థులు అత్యల్ప మెజార్టీతో విజయం సాధించారు. దొరవారిసత్రం మండలం సింగనాలత్తూరు సర్పంచ్‌గా TDPకు చెందిన చింతకాని సునంద 5 ఓట్ల మెజార్టీతో, చిత్తూరు జిల్లా విజయపురం మండలం పోతులరాజు కండ్రిగ సర్పంచ్‌గా చంద్రబాబు (TDP) 4 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలాగే నిండ్ర మండలం శ్రీరామాపురం సర్పంచ్‌గా మహేశ్‌ (YCP) 2 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕