AP: తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి కోసం అధికార టీడీపీలో వివాదాలు తలెత్తే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ మున్సిపాలిటీలో, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించి, వైసీపీ కౌన్సిలర్లను చేర్చుకుని టీడీపీకి అధికారం కట్టబెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. అయితే, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన మార్కు చూపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.