AP: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నేడు (శనివారం) పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. తిరువూరు పంచాయితీ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ సిద్ధం చేసిన నివేదికను ఆయనకు సమర్పించనుంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు–ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలపై కమిటీ సమగ్రంగా విచారణ జరిపి నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో కొలికపూడి ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు.