AP: తన రాజకీయ జీవితంలో గూగుల్ ఒప్పందం పెద్ద విజయమని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘గూగుల్ విశాఖలో అడుగుపెడుతోంది. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశాం. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ పాల్గొన్నారు.