ఎంతో మంది మహిళలకు ఇది మంచి ప్లాట్‌ఫామ్‌: నారా బ్రాహ్మణి

AP: మంగళగిరి స్టేడియంలో ఉమెన్ ఏపీఎల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి, భారత జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎంతో మంది మహిళలకు ఇది మంచి ప్లాట్‌ఫామ్‌. తర్వాతి జనరేషన్ మహిళలకు ఈ టోర్నమెంట్ స్ఫూర్తిగా నిలుస్తుంది. టాలెంట్ ఉండి అవకాశం దొరికితే నమ్మకంగా సద్వినియోగం చేసుకోవాలి’ అని యువతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕