AP: మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను నివారించడమే ‘హనుమాన్ ప్రాజెక్ట్’ ఉద్దేశమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషులు, వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్న వన్యప్రాణులను ఎలా హ్యాండిల్ చేయాలనే ఆలోచనతోనే దీన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడం, సరిహద్దు గ్రామాల ప్రజల ఉపాధిని కాపాడడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు.