AP: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతూ, భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఈ అర్ధరాత్రి తర్వాత ప్రారంభమవుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతూ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం తొలిసారిగా ఇక్కడి రన్‌వేపై అడుగుపెట్టనుంది. ఈ అపురూప క్షణంతో ఈ ప్రాంత విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది.