AP: టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుని 'సైకో మహానాడు'గా మాజీ మంత్రి రోజా అభివర్ణించారు. మహానాడు పేరుతో జరుగుతున్న కార్యక్రమాలను ఆమె తీవ్రంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎదురుగా నిలబడే దమ్ము లేనివారు మైకుల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మహానాడు పేరుతో రికార్డింగ్ డాన్సులు పెట్టినా జనం రావడం లేదని ఆమె అన్నారు. జగనన్న కాలు గోటికి కూడా సరిపోని వారు మైకుల ముందు మొరుగుతున్నారని ఆమె ఆరోపించారు.