కొడాలి నాని రాజకీయ వారసుడు ఇతనే: పేర్ని నాని (వీడియో)

AP: వైసీపీ కీలక నేత కొడాలి నాని రాజకీయ వారసత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో ఎస్ఐఆర్‌పై జరిగిన కార్యక్రమంలో పేర్ని నాని మాట్లాడుతూ.. 2034 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని తమ్ముడి కుమారుడు అర్జునరావు పోటీ చేస్తారని వెల్లడించారు. కొడాలి నానికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారికి రాజకీయాలపై ఆసక్తి లేదని పేర్కొన్నారు. అందుకే కొడాలి నాని రాజకీయ వారసుడిగా అర్జునరావు ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్