ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కానున్న నేపథ్యంలో ఆర్టీసీ ముద్రించిన నమూనా టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్‌పై ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పేరు, డిపో వివరాలు, ప్రయాణించే ప్రదేశం, గమ్యస్థానం, ‘స్త్రీశక్తి’ అనే గుర్తింపు ముద్రించబడింది. మొత్తం టికెట్ ధరను ప్రభుత్వం భరించే నేపథ్యంలో చెల్లించవలసినది రూ.0.00గా ముద్రించడం ఆసక్తికరంగా మారింది.