తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక TDP కార్యకర్త డేవిడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. పార్టీ కోసం కష్టపడితే అక్రమంగా కేసులు పెట్టి ఎమ్మెల్యే వేధిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం కార్యకర్త విజయవాడలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కొలికపూడికి టీడీపీ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.