AP: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నామినేషన్ల అంశంపై తమ పార్టీ న్యాయస్థానాల్లోనే పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ఎస్ఈసీకి, కోర్టుకు అందజేస్తామని ఆయన తెలిపారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఉన్న 59మంది పోలీసు అధికారులను వెంటనే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కేంద్రాల్లో సీసీ ఫుటేజ్ లైవ్ ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడాలని జగన్ కోరారు.