త్వరలో మంత్రివర్గంలోకి ఆ ఐదుగురు నేతలు!

AP: త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు క్యాబినెట్లోకి చేరనున్నట్లు సమాచారం. డాక్టర్ బెందాళం అశోక్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోణతాల రామకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, పల్లా శ్రీనివాస్ పేర్లు దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే, ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. సామాజిక సమతూకం, అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తూ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఈ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్