AP: గవర్నర్ కోటాలో వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనుండటంతో ఆ రెండు స్థానాలపై TDP దృష్టి సారించింది. ఈ పదవుల కోసం పార్టీలో పది మందికి పైగా ఆశావహులు ఉండటంతో సర్దుబాటు చేయడం CM చంద్రబాబుకు కష్టంగా మారింది. అయితే, పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మ, వసంత కృష్ణ ప్రసాద్ కోసం సీటు వదులుకున్న దేవినేని ఉమామహేశ్వరరావులకు ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.