తప్పు చేసినవారికి శిక్ష పడాల్సిందే: సజ్జల

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో పాలన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధం, దుర్మార్గం, క్రూరత్వం కలిస్తేనే వెన్నుపోటు పార్టీ అని, రాష్ట్రంలో అలాంటి పాలనే జరుగుతోందని ఆయన అన్నారు. డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని, అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా కింద అనర్హులకు జాబ్స్ కేటాయించారని మండిపడ్డారు. ఈ అవకతవకలపై సీబీఐ చేత నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕