జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు

AP: జగన్ నెల్లూరు పర్యటనలో వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. వైసీపీ నేత, మాజీ మంత్రి ప్రసన్నకుమార్ ఇంటికి వెళ్లే రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను వైసీపీ నేతలు లాగి పారిపోయారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య చేయి విరిగింది. దాంతో ప్రసన్నకుమార్, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుపై ధర్నా, బైక్ ర్యాలీ చేపట్టినందుకు దర్గామిట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్